ఆప్షన్స్ ట్రేడింగ్‌‌‌‌లో రిటైల్ ఇన్వెస్టర్లకు అడ్డు పెట్టం

ఆప్షన్స్ ట్రేడింగ్‌‌‌‌లో  రిటైల్ ఇన్వెస్టర్లకు అడ్డు పెట్టం

న్యూఢిల్లీ: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌అండ్‌‌‌‌ఓ) సెగ్మెంట్‌‌‌‌లో రిటైల్ ఇన్వెస్టర్లు  చేసే ట్రేడ్స్‌‌‌‌ విలువ,  వారి సంపదను లింక్ చేయాలని సెబీ చూస్తోందన్న రిపోర్ట్‌‌‌‌లు వెలువడుతున్నాయి. వీటిపై మార్కెట్ రెగ్యులేటరీ  స్పందించింది.  ‌‌‌‌ ఎఫ్‌‌‌‌ అండ్ ఓ సెగ్మెంట్‌‌‌‌లో రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ తగ్గించేందుకు  చర్యలేవి తీసుకోవడం లేదని,   ఇన్వెస్టర్ల సంపద బట్టి  డెరివేటివ్ ట్రేడింగ్‌‌‌‌పై రిస్ట్రిక్షన్లు ఉంటాయన్న అంశం నిజం కాదని తేల్చింది. క్లయింట్లను  స్టాక్ బ్రోకర్లు యాడ్ చేసుకునే ప్రాసెస్‌‌‌‌ను మరింత సులభతరం చేయాలని చూస్తున్నామని  వివరించింది. రిస్క్‌‌‌‌ బేస్డ్ విధానంలో క్లయింట్ల ఆన్‌‌‌‌బోర్డింగ్ ప్రాసెస్‌‌‌‌ను చేపట్టాలని స్టాక్ బ్రోకర్లకు చెబుతున్నామని పేర్కొంది. డెరివేటివ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ తగ్గించడంపై ఎటువంటి ప్రపోజల్స్ లేవని మీడియా రిపోర్ట్స్‌‌‌‌ను ఉద్దేశిస్తూ సెబీ క్లారిటీ ఇచ్చింది. ఆన్‌‌‌‌ బోర్డింగ్ ప్రాసెస్‌‌‌‌, డాక్యుమెంటేషన్‌‌‌‌కు సంబంధించి స్టాక్ బ్రోకర్లు  ఎలా నడుచుకోవాలో  2009, డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోనే సెబీ రెగ్యులేషన్స్‌‌‌‌ను ప్రకటించింది. 

తమ క్లయింట్ల ఆర్థిక స్థోమతను   లెక్కలోకి తీసుకోవాలని పేర్కొంది.  ‘డెరివేటివ్ సెగ్మెంట్‌‌‌‌ను ఎంచుకున్న  క్లయింట్ల ఫైనాన్షియల్ డిటెయిల్స్ స్టాక్ బ్రోకర్ల దగ్గర ఉండాలి. ఇతర క్లయింట్లకు సంబంధించి అయితే తమ రిస్క్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ను బట్టి డాక్యుమెంట్స్ తీసుకోవాలి’ అని రెగ్యులేటరీ పేర్కొంది. ఆన్‌‌‌‌బోర్డింగ్ ప్రాసెస్‌‌‌‌ను మరింత ఈజీగా మార్చేందుకు రూల్స్‌‌‌‌ను సెబీ పరిశీలిస్తోంది. ఫ్రేమ్‌‌‌‌ వర్క్‌‌‌‌లో ఎటువంటి మార్పులు అయినా తెచ్చే ముందు ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌, పబ్లిక్‌‌‌‌తో చర్చలు జరుపుతామని సెబీ తన తాజా సర్క్యులర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.  సంపద బట్టి డెరివేటివ్ మార్కెట్‌‌‌‌లో ట్రేడింగ్‌‌‌‌కు అవకాశం ఇస్తే  రిటైల్ ఇన్వెస్టర్లు  మార్కెట్‌‌‌‌లోకి ఈజీగా ఎంటర్ అవ్వడానికి వీలుంటుందని, అదే టైమ్‌‌‌‌లో  రిస్క్‌‌‌‌ తెలిసి ఉండి, మేనేజ్‌‌‌‌ చేయగలమనుకునే వారు డెరివేటివ్ సెగ్మెంట్‌‌‌‌లో ట్రేడ్ చేయడానికి వీలు కలుగుతుందని బ్రోకరేజ్‌‌‌‌ ఫైర్స్‌‌‌‌ ఫౌండర్  తేజస్‌‌‌‌ ఖోడే అన్నారు. డెరివేటివ్  సెగ్మెంట్‌లో లెవరేజ్‌‌‌‌ను, స్పెక్యులేషన్‌‌‌‌ను, రిటైల్‌‌‌‌ ఇన్వెస్టర్లపై రూల్స్ భారాన్ని తగ్గించేందుకు సెబీ త్వరలో గైడెన్స్ ప్రకటిస్తుందన్నారు.