
న్యూఢిల్లీ : ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు డే ట్రేడింగ్ చేయడానికి వీలు లేదని సెబీ పేర్కొంది. దీనిని బట్టి ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు చెసే ట్రాన్సాక్షన్లు కస్టోడియన్ లెవెల్‌లో జరుగుతాయని, వీరు స్టాక్ ఎక్స్చేంజిలతో నెట్ బేసిస్‌లో తమ డెలివరీలను పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది.
మరోవైపు అన్ని కేటగిరీల్లోని ఇన్వెస్టర్లు షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చని సెబీ పేర్కొంది. కానీ, నేకెడ్ (ప్రొటెక్షన్ లేకుండా) సెల్లింగ్ చేయడానికి కుదరదని తెలిపింది. ఎఫ్ అండ్ ఓ కింద ఉన్న అన్ని షేర్లు షార్ట్ సెల్లింగ్‌కు అర్హులని వివరించింది.