న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఫ్రాక్టల్ అనలిటిక్స్, సాస్ కంపెనీ అమాగి మీడియా ల్యాబ్స్, కార్డియాక్ స్టెంట్లు తయారు చేసే సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ తమ ఐపీఓలకు సెబీ అనుమతి పొందాయి. ఫ్రాక్టల్ ఐపీఓ ద్వారా రూ.4,900 కోట్లు సమీకరించనుంది.
ఇందులో రూ.1,279.3 కోట్ల ఫ్రెష్ ఇష్యూ, రూ.3,620.7 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ఉన్నాయి. క్వినగ్ బిడ్కో, టీపీజీ ఫెట్ హోల్డింగ్స్, సత్య కుమారి రేమల, జీఎల్‌ఎం ఫ్యామిలీ ట్రస్ట్ తమ వాటాలో కొంత భాగాన్ని విక్రయించనున్నాయి. ఈ నిధులను అమెరికాలో పెట్టుబడి, అప్పుల చెల్లింపు, కొత్త ఆఫీసులు, ఆర్ అండ్ డీ కోసం వాడతామని ఫ్రాక్టల్ పేర్కొంది.
అమాగి ..
అమాగి ఐపీఓలో రూ.1,020 కోట్ల ఫ్రెష్ ఇష్యూ, 3.41 కోట్ల షేర్ల ఓఎఫ్‌ఎస్ ఉంది. రూ.667 కోట్లనుటెక్నాలజీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడికి, మిగతా మొత్తం అక్విజిషన్లు, కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తామని కంపెనీ పేర్కొంది.
సహజానంద్ మెడికల్..
సహజానంద్ మెడికల్ ఐపీఓ పూర్తిగా ఓఎఫ్‌ఎస్ రూపంలో 2.76 కోట్ల షేర్లతో ఉంటుంది. షేర్లను శ్రీ హరి ట్రస్ట్, సమరా క్యాపిటల్, కోటక్ ప్రీ ఐపీఓ ఫండ్, ఎన్‌హెచ్‌పీఈఏ స్పార్కల్ హోల్డింగ్ బీవీ విక్రయిస్తాయి. ఈ మూడు సంస్థలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్టింగ్ అవుతాయి.
