న్యూఢిల్లీ: పాసివ్ మ్యూచువల్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్ వంటివి) కు సంబంధించి రూల్స్‌ను సెబీ సులభతరం చేసింది. మ్యూచువల్ ఫండ్స్ లైట్ (ఎంఎఫ్) ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. మ్యూచువల్ ఫండ్స్‌ను ప్రమోట్ చేసే స్పాన్సర్లు ఈ సెగ్మెంట్‌లోకి ఈజీగా ఎంటర్ అవ్వడానికి రూల్స్‌ను సులభం చేసింది. ఎంఎఫ్ ఫ్రేమ్‌వర్క్ కింద మ్యూచువల్ ఫండ్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చే స్పాన్సర్ల నెట్‌వర్త్, లాభాలు, ట్రాక్ రికార్డ్ అర్హతను తగ్గించింది.
ట్రస్టీల బాధ్యతలను సులభం చేసింది. పాసివ్ స్కీమ్స్‌కు సంబంధించి డిస్‌క్లోజర్, అప్రూవల్ ప్రాసెస్ అబ్లిగేషన్స్‌ను తగ్గించింది. ఇదిలా ఉంటే, ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ రూల్స్‌పై సోమవారం జరిగిన బోర్డ్ మీటింగ్‌లో చర్చించలేదని సెబీ వర్గాలు తెలిపాయి.