సెబీ నుంచి పర్వా సిస్టమ్ తప్పుడు ప్రచారాలను ఆపడానికే..

సెబీ నుంచి పర్వా సిస్టమ్ తప్పుడు ప్రచారాలను ఆపడానికే..

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్​ మార్కెట్లలో పారదర్శకత కోసం సెబీ సోమవారం పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీ (పర్వా) విధానాన్ని తెచ్చింది. కేర్ రేటింగ్స్, ఎన్ఎస్ఈ సహకారంతో దీన్ని ప్రారంభించింది. సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్లు తమ గత పనితీరును దీని ద్వారా చెక్​ చేసుకోవచ్చు. ఫిన్​ఫ్లూయెన్సర్లు చేసే తప్పుడు ప్రచారాలను అరికట్టడమే పర్వా లక్ష్యమని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. మధ్యవర్తులు తమకు వచ్చిన లాభాలను మాత్రమే చూపించడానికి ఇందులో వీల్లేదు. ఇన్వెస్టర్లు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది సాయపడుతుంది.