క్వాంట్‌‌‌‌ మ్యూచువల్ ఫండ్ ఆఫీసుల్లో సెబీ సోదాలు

క్వాంట్‌‌‌‌ మ్యూచువల్ ఫండ్ ఆఫీసుల్లో సెబీ సోదాలు

న్యూఢిల్లీ: సందీప్‌‌‌‌ టాండన్‌‌‌‌కు చెందిన క్వాంట్‌‌‌‌ మ్యూచువల్ ఫండ్ ఆఫీసుల్లో సెబీ సోదాలు నిర్వహించిందని, కొన్ని డాక్యుమెంట్లను సీజ్ చేసిందని మనీకంట్రోల్ రిపోర్ట్ చేసింది.  ఈ కంపెనీ ఫ్రంట్ రన్నింగ్‌‌‌‌కు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. అంటే కంపెనీల డీల్స్‌‌‌‌కు సంబంధించిన వివరాలు ముందుగానే తెలుసుకొని, ఈ మ్యూచువల్ ఫండ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో ఇన్వెస్ట్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.

క్వాంట్ మ్యూచువల్ ఫండ్‌‌‌‌కు చెందిన ముంబై, హైదరాబాద్‌‌‌‌ ఆఫీసుల్లో సెబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతేకాకుండా ఫ్రంట్ రన్నింగ్ కేసులో అనుమానితులగా ఉన్నవారిని  ప్రశ్నించారు. క్వాంటమ్‌‌‌‌ మ్యూచువల్ ఫండ్‌‌‌‌ 2017 లో ఫండ్ లైసెన్స్ అందుకుంది.  2019 లో కేవలం రూ.100 కోట్లు మేనేజ్ చేసిన ఈ కంపెనీ, ప్రస్తుతం రూ.90 వేల కోట్లు మేనేజ్ చేస్తోంది. ఈ ఏడాది 26 కొత్త స్కీమ్‌‌‌‌లను, 54 లక్షల ఫోలియోల (అకౌంట్ల) ను మేనేజ్ చేస్తోంది.