
న్యూఢిల్లీ: మార్కెట్‌లో చిన్న ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెంచేందుకు బేసిక్ సర్వీస్ డీమాట్ అకౌంట్ (బీఎస్‌డీఏ) లిమిట్‌ను ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు సెబీ పెంచింది. సాధారణ డీమాట్ అకౌంట్‌కు బేసిక్ వెర్షనే బీఎస్‌డీఏ. చిన్న ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు బీఎస్‌డీఏ లపై యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి వస్తుంది.
ఒకే డిమాట్ అకౌంట్ ఉండి, పోర్టుఫోలియోలోని డెట్, నాన్ డెట్ సెక్యూరిటీల మొత్తం విలువ ఏ టైమ్‌లోనైనా రూ. 10 లక్షలు దాటకుండా ఉంటేనే బీఎస్‌డీఏ అకౌంట్‌గా పరిగణిస్తారు. ఇన్వెస్టర్ల పోర్టుఫోలియో వాల్యూ రూ.4 లక్షలలోపు ఉంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీ జీరో. రూ.4 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.100 ఛార్జీ పడుతుంది. రూ.10 లక్షల పైన ఉంటే ఆటోమెటిక్‌గా బీఎస్‌డీఏ రెగ్యులర్ అకౌంట్‌గా మారిపోతుంది.