వాషింగ్టన్: యూరోప్, అమెరికాలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎక్స్ పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల లాక్ డౌన్ ఎత్తేయడంతో జనం పెద్ద సంఖ్యలో రోడ్లపై కి వస్తున్నారని, దీంతో మరణాల సంఖ్య, కేసులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. టెస్టింగ్ , చనిపోయిన వారి సంఖ్యను ప్రకటించడంలో తేడాలు, కొన్ని దేశాలు కేసులను దాచేస్తున్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సెంకండ్ వేవ్ ఖచ్చింతంగా ఉంటుంది.
కానీ అది ఎంత దూరం వెళుతుందని అనేదే అసలు సమస్య. ఈ వేవ్ వివ్చిన్నంగా ఉంటుందా? పెద్దగా ఉంటుందా? అనేది ఇప్పుడే చెప్పడం తొందర పాటు అవుతుంది” అని ఫ్రాన్స్ ఫాశ్చర్ వైరస్ యూనిట్ హెడ్ ఒలీవర్ స్క్వార్జ్ చెప్పారు.
ఒక్కో కంట్రీలో ఒక్కోలా..
ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే జర్మనీలో మళ్లీ కేసుల సంఖ్య పెరిగితే ఏం చేయాలనే దానిపై ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. ఇటలీలో కొత్త కేసుల బాధితులు, వారి కాంటాక్ట్స్ గుర్తించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఫ్రాన్స్ లో ఇంకా లాక్డౌన్ ఎత్తేయకపోయినా రికన్ ఫైన్ మెంట్ సిద్ధం చేస్తున్నారు. అమెరికాలో సగానికి పైగా రాష్ట్రాలు లాక్ డౌన్ ను తొలగించాయి. ఇబ్బందుల్లో ఉన్న ఎకానమీని గాడిలో పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు ఇండ్లలో నుంచి బయటికి రాని జనం.. సడలింపులతో ఇప్పుడు పెద్ద సంఖ్యలో రోడ్లపై కి వస్తున్నట్టు సెల్ ఫోన్ డేటా చెబుతోంది. లాక్ డౌన్ ఎత్తేయడంతో ఐయోవా, మిస్సోరి, జార్యా, జి టెన్నె స్సీ, టెక్సాస్ లో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఇప్పటికీ అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కరోనా టెస్టింగ్స్ అంతగా దృష్టిపెట్టడం లేదని నిపుణులు చెబుతున్నారు. వైరస్ ను గుర్తించడంలో అది కొత్త ప్రాంతాలకు విస్తరించకుండా చేయడంలో టెస్టింగ్ లు కీ రోల్ ప్లే చేస్తాయని అంటున్నారు.
మరణాల సంఖ్య పెరుగుతుంది
‘‘పబ్లిక్ హెల్త్ కు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయకుండా రిలాక్సేషన్స్ ఇచ్చినట్లయితే ఇంకా అనేక కేసులకు మనం కారణమవుతాం. దాని వల్ల మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది”అని వాషింగ్ టన్ లో కెయిసర్ ఫ్యామిలీ ఫౌండేషన్ లోని గ్లోబల్ హెల్త్ పాలసీ అసోసియేట్ డైరెక్టర్ జోష్ మిచౌడ్ చెప్పారు. ‘‘ బార్లను తెరవడం వల్ల జనం ఎక్కువగా రావడం మొదలవుతుంది. వారు ఫిజికల్ డిస్టెన్స్ పాటించే పరిస్థితి ఉండదు. స్పోర్స్ కన్సర్ట్స్ మొదలైన వాటిని తెరవడం వల్ల పెద్ద సంఖ్యలో జనం గుమిగూడతారు. కాంటాక్ట్ ట్రేసింగ్ భారీగా చేయడం వల్ల మాత్రమే కరోనాను కట్టడి చేయవచ్చు. ఇందు కోసం వందలాది మంది పబ్లిక్ హెల్త్ వర్కర్లు వేల మందిని టెస్ట్ చేయాలి. కానీ ప్రస్తుతం అమెరికాలో ఆ పరిస్థితి లేదు” అని కొలంబియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యూనిటీకి చెందిన డాక్టర్ ఆగస్టు నాటికి అమెరికాలో డెత్స్ డబుల్ ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 36 లక్షల కరోనా కేసులు రికారయి్డ తే.. రెండున్నర లక్షల మంది చనిపోయారని జాన్స్హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా వెల్లడిస్తోం ది. అమెరికాలో 70 వేల మంది చనిపోగా.. 12 లక్షలకుపైగా కేసులు రి కార్డయ్యాయి. ఇక యూరోప్లో 1,40, 000 మందికిపైగా మరణించారు. ఆగస్టు నాటికి అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 1,34,000కు పెరుగుతుందని యూ నివర్సిటీ ఆఫ్ వాషింగ్ట న్ రీసెర్చర్స్చెబుతు న్నారు. గతంలో అంచనా వేసిన దానికి ఇది డబుల్. రోజువారీ కేసుల సంఖ్య 20 వేలుగా, డెత్స్సంఖ్య వెయ్యికి పైగా నమోదవుతోంది. వందేండ్లక్రితం స్పానిష్ ఫ్లూవచ్చినప్పుడు తొలి దశ కంటే సెకండ్వేవ్టైంలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రధాన కారణం అధికారులు మాస్ మీటింగ్స్ కు అనుమతి ఇవ్వడమే కారణం.
