హైదరాబాద్ లో కొనసాగుతున్న నిమజ్జనం..హుస్సేన్ సాగర్ దగ్గర బారులు తీరిన గణనాధులు

హైదరాబాద్ లో కొనసాగుతున్న నిమజ్జనం..హుస్సేన్ సాగర్ దగ్గర బారులు తీరిన గణనాధులు

హైదరాబాద్ సిటీలో రెండో రోజు ప్రశాంతంగా గణనాధుల నిమజ్జనం కొనసాగుతోంది. ఆదివారం( సెప్టెంబర్7) ఉదయం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనంకోసం భారీగా గణేషులు బారులు తీరి వున్నారు. నగరంలో హుస్సేన్ సాగర్ తోపాటు 93 ఆర్టిఫిషియల్ వాటర్ పాండ్స్, చెరువుల్లో మొత్తం 2లక్షల61 వేలకు పైగా గణేష్ ప్రతిమలు నిమజ్జనం అయ్యాయి. ఒక్క హుస్సేన్ సాగర్ లోనే ఆదివారం పదిగంటలవరకు 11 వేల గణేష్ విగ్రహాల నిమజ్జనం అయినట్లు GHMC అధికారులు తెలిపారు. 

హుస్సేన్ సాగర్ దగ్గర నిమజ్జనంకోసం గణనాధులు బారులు తీరు వున్నారు. భారీ టస్కర్ వాహనాలతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో రోడ్డు నిండిపోయాయి. నిమజ్జన ప్రక్రియ త్వరగా ముగించేందుకు పోలీసుల కసరత్తు చేస్తున్నారు. వచ్చే ప్రతి వాహనాన్ని ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. 

తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వైపు వచ్చే గణనాధులను విగ్రహాల సైజ్ ను బట్టి ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ వైపుకు తరలిస్తున్నారు. శోభయాత్రలో ఆలస్యం అవ్వకుండా తరెలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. 

పాత బస్తీ నుండి వచ్చే గణేషుని శోభాయాత్రలు బషీర్ బాగ్ వరకు నిలిచిపోయాయి. ఇప్పటికే హుస్సేన్ సాగర్ లో 70 వేల సంఖ్యలో గణేశుల నిమజ్జనం జరిగినట్లు తెలుస్తోంది. ఇంకా వందల సంఖ్యలో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి గణేష్ విగ్రహాలు రెడీగా ఉన్నాయి. 

మరోవైపు వినాయక నిమజ్జనం సందర్భంగా వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. నగర వ్యాప్తంగా ఇవాళ, రేపు సానిటేషన్ డ్రైవ్ చేపట్టారు. ఇప్పటివరకు 11వేల టన్నులకు పైగా వ్యర్థాలను తొలగించారు. ఈ వ్యర్థాలను జవహర్ నగర్ లోని ప్రాసెసింగ్ సెంటర్ కు తరలించారు. నిమజ్జన పాయింట్లు, నిమజ్జన ఊరేగింపు మార్గాలలో వ్యర్థాల తొలగింపును  వేగవంతం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు.