ఏపీలో నిలిచిపోయిన రెండో డోస్ వ్యాక్సినేషన్

ఏపీలో నిలిచిపోయిన రెండో డోస్ వ్యాక్సినేషన్

అమరావతి: ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా కరోనా రెండో డోసు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చిత్తూరు, విజయనగరం, కృష్ణా, నెల్లూరు , తూర్పు గోదావరి, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, కడప తదితర జిల్లాల్లో వ్యాక్సేషన్ నిలిపేశారు. రద్దీని నివారించడానికి మూడు కేటగిరిలుగా చేసి వ్యాక్సిన్ ఇవ్వాలని యోచిస్తున్నారు. మొదటి విడుత ప్రాధాన్యతగా కరోనా వారియర్స్, 60 ఏళ్లు పైబడిన వారు, ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారిని మూడు కేటగిరీలుగా విభజించి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ మూడు కేటగిరీల వారికి టోకెన్లు జారీ చేసి.. వ్యాక్సిన్ ఇవ్వాలని.. దీని వల్ల రద్దీ ఆగిపోతుందని భావిస్తున్నారు.