
ప్రేమలో పడ్డ కొత్తలో ఆ జంట మనసును కొత్త ఊసులెన్నో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ‘‘అరె ఏమయింది ఉన్నట్టుంది ఇవ్వాలే.. అలవాటే లేని ఏవో ఆనందాలే.. నా గుండెల్లో ఏదో వాలే వాలే.. ’ అని పాడుకుంటుంటారు. నాని, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ చిత్రంలోనూ అలాంటి ఓ సన్నివేశం ఉంది. సందర్భానికి తగ్గట్టుగా జేక్స్ బిజోయ్ కంపోజ్ చేసిన ఈ పాటను సంజిత్ హెగ్డే, కృష్ణ లాస్య ముత్యాల మనసుకు హత్తుకునేలా పాడారు.
‘ఉల్లాసం ఉరికే ఎదలో.. ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో.. ఉప్పొంగే ఊహల జడిలో.. మనకే మనమే ఎవరో..’ అంటూ సాగిన ఈ పాటలో నాని, ప్రియాంక జంట నేచురల్ ఎక్స్ ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నారు. ‘మౌనాలే మన ఊసులలో.. మాటే తప్పిపోయే పెదవులలో.. మిన్నంటే మనసుల సడిలో.. మనతో మనమే ఎటుకో..’ అంటూ సనరే రాసిన లిరిక్స్ ప్రేమజంట భావోద్వేగాలను ఎంతో అందంగా ఎక్స్‌ప్రెస్ చేసేలా ఉన్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 29న పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.