యాదాద్రి జిల్లాలో సెకెండ్ ఫేజ్లోనూ తరలి వచ్చిన ఓటర్లు

 యాదాద్రి జిల్లాలో సెకెండ్ ఫేజ్లోనూ తరలి వచ్చిన ఓటర్లు
  • సెకెండ్ ఫేజ్​లోనూ..  భారీ పోలింగ్ 91.72 శాతం నమోదు 
  • అత్యధికంగా భూదాన్​ పోచంపల్లిలో  93.11
  • రామన్నపేటలో 90.58

యాదాద్రి, వెలుగు:  రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మహిళలు భారీ ఎత్తున ఓట్లు వేశారు. మెజారిటీ పంచాయతీల్లో పెద్ద ఎత్తున ఓటింగ్​లో పాల్గొన్నారు. పోటీ చేసిన అభ్యర్థుల గెలుపులో మహిళలే నిర్ణేతలుగా వ్యవహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు తరలివచ్చారు. 

జిల్లాలోని హెచ్​ఎండీఏ మండలాలైన భువనగిరి, బీబీనగర్​. భూదాన్​ పోచంపల్లి సహా వలిగొండ, రామన్నపేట మండలాల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి.  ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించడంలో పోటీ చేసిన అభ్యర్థులు సక్సెస్​ అయ్యారు. దీంతో చాలా మంది ఓటర్లు శనివారం రాత్రే రాగా మరికొందరు ఆదివారం ఉదయం వచ్చి ఓటు వేయడానికి ఉదయం ఏడు నుంచే బారులు తీరారు. వృద్ధులు కూడా ఉదయమే పోలింగ్​ సెంటర్లకు వచ్చి ఓట్లు వేశారు. 

సెకండ్ ఫేజ్​లో 91.72 శాతం

సెకండ్ ఫేజ్​లో 150 పంచాయతీలు, 1332 వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. 2,07,816 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఐదు పంచాయతీల్లో సర్పంచ్​ సహా పాలకవర్గం, మరో ఐదు పంచాయతీల్లో సర్పంచ్​లు ఏకగ్రీమయ్యారు. దీంతో ఆదివారం 140 పంచాయతీల్లో 378 మంది సర్పంచ్​ అభ్యర్థులు, 1161 వార్డుల్లో 2581 మంది పోటీపడ్డారు. 

ఏకగ్రీమైన పంచాయతీలు, వార్డుల్లో ఎన్నికలు జరగనందున ఓటర్ల సంఖ్య 5100 తగ్గి 2,02,716కు చేరింది.  ఉదయం తొమ్మది గంటల వరకే 20.92 శాతం పోలింగ్​ నమోదైంది. 11 గంటలకు 57.12 శాతం, పోలింగ్​ సమయం ముగిసే సమయానికి మధ్యాహ్నం ఒంటిగంటకు 82.53 శాతం నమోదైంది. ఆ తర్వాత గేటులోపుల ఉన్న వాళ్లు ఓట్లు వేశారు. మొత్తంగా 1,85,937  (91.72శాతం) మంది ఓటేశారు. 

ఓటెత్తిన మహిళలు

ఫస్ట్​ ఫేజ్​ తరహాలోనే సెకండ్ ఫేజ్​ ఎన్నికల్లోనూ మహిళలే నిర్ణేతలుగా నిలిచారు. ఈ దశలో పురుషుల ఓట్లు 1,00,801 ఉండగా 92,562 (91.83 శాతం) ఓటేశారు. మహిళల ఓట్లు 1,01,915 ఓట్లు ఉండగా 93,375 (91.62 శాతం) ఓటు వేశారు. అయితే పోలింగ్​ పర్సెంటేజీలో మహిళల ఓట్లు తగ్గినా, ఓట్ల సంఖ్యలో మాత్రం పురుషుల కంటే ఎక్కువగా వేశారు. కొన్ని పంచాయతీల్లో తప్ప మిగిలిన వాటిలో మహిళల ఓట్లే ఎక్కువగా పోలింగ్​ కావడంలో అభ్యర్థుల గెలుపులో నిర్ణేతలుగా నిలిచారు. 

పోచంపల్లిలో ఎక్కువ.. రామన్నపేటలో తక్కువ

సెకండ్ ​ ఫేజ్​లో ఐదు మండలాల్లో ఎన్నికలు జరగగా భూదాన్​ పోచంపల్లిలో పోలింగ్​ ఎక్కువగా నమోదైంది. పోచంపల్లిలో 20 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో 26,921 ఓటర్లు ఉండగా 25,066 (93.11 శాతం) ఓటేశారు. 

భువనగిరి మండలంలో 31 పంచాయతీల్లో 38,306 ఓట్లు ఉండగా 32,751 (93.08 శాతం) ఓట్లు పోలయ్యాయి.  బీబీనగర్​ మండలంలో 30 పంచాయతీల్లో 41,154 ఓట్లు ఉండగా 37,605 (91.38 శాతం) పోలయ్యాయి. వలిగొండ మండలంలో 37 పంచాయతీల్లో 52,431 ఓట్లు ఉండగా 47,840  ఓట్లు పోలయ్యాయి. రామన్నపేట మండలంలో 22 పంచాయతీల్లో 43,904 ఓట్లుఉండగా 39,769 (90.58 శాతం) పోలయ్యాయి.