టీ20ల్లో ఇండియాకు సెకండ్ ప్లేస్

టీ20ల్లో ఇండియాకు సెకండ్ ప్లేస్

దుబాయ్: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ఇండియా రెండో ప్లేస్కు ఎగబాకింది. బుధవారం రిలీజ్ చేసిన తాజా జాబితాలో టీమిండియా ఖాతాలో 268 పాయింట్లు ఉన్నాయి.  ఇంగ్లండ్ (275) టాప్ ప్లేస్లో ఉండగా, ఆస్ట్రేలియా (267) థర్డ్ ర్యాంక్కు పడిపోయింది. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో కంగారూలు 2–3తో సిరీస్ కోల్పోవడం ఇండియా ర్యాంక్ మెరుగుపడటానికి దోహదం చేసింది. ఈ నెల 12 నుంచి ఇంగ్లిష్ టీమ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇండియా రాణిస్తే ర్యాంక్ మరింత మెరుగవుతుంది. ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కేఎల్ రాహుల్ (816 పాయింట్స్).. ఒక ర్యాంక్ దిగజారి మూడో ప్లేస్లో నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (697) ఆరో ర్యాంక్లోనే కొనసాగుతున్నాడు. బౌలర్ల కేటగిరీలో  టీమిండియా నుంచి టాప్–10లో ఒక్కర కూడా లేరు.  పేసర్జస్ప్రీత్ బుమ్రా (593)..18వ ర్యాంక్లో ఉన్నాడు.