సోలార్‌‌ పవర్‌‌లో దేశంలోనే సెకండ్​ ప్లేస్ : గవర్నర్‌‌

సోలార్‌‌ పవర్‌‌లో దేశంలోనే సెకండ్​ ప్లేస్ : గవర్నర్‌‌

ఘనంగా ఎనర్జీ కన్జర్వేషన్‌‌ అవార్డుల ప్రదానం

హైదరాబాద్‌‌, వెలుగు : సోలార్‌‌ పవర్‌‌ ప్రొడక్షన్​లో తెలంగాణ..దేశంలోనే రెండో స్థానంలో ఉన్నదని, హరితహారంతో ఇంధన వనరులను కాపాడానికి కృషి చేస్తోందని గవర్నర్‌‌ తమిళిసై సౌందరరాజన్‌‌ అన్నారు. జీహెచ్‌‌ఎంసీ పరిధిలోనే 4.50లక్షల ఎల్‌‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయడమే దీనికి ఉదాహరణ అని అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్​లోని విశ్వేశ్వరయ్య భవన్ లో టీఎస్‌‌ రెడ్‌‌కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంధన పొదుపు అవార్డుల కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇండియా తీసుకుంటున్న ఇన్షియేటివ్​తో సోలార్‌‌ ఎలయెన్స్‌‌లో ఇప్పటికే 80 దేశాలు చేరాయని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తొలగించిన చెట్ల స్థానంలో మరోచోట కోట్లాది మొక్కలు నాటడం ఎనర్జీ కన్సర్వేషన్‌‌ చేస్తున్న గొప్ప విషయమన్నారు.

విద్యుత్​శాఖామంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడే నాటికి సాంప్రదాయేతర ఇంధనాలు 70  మెగావాట్లు మాత్రమే  ఉండేదని, ఇప్పుడు 3700 మెగావాట్ల సోలార్‌‌ పవర్‌‌ సాధించామన్నారు. ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో సీఎండీ ప్రభాకర్‌‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంట్​ప్రొడక్షన్, సరఫరాతో పాటు తలసరి విద్యుత్‌‌ వినియోగం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, టీఎస్ రెడ్ కో చైర్మన్​ అబ్దుల్ అలీం, టీఎస్ రెడ్ కో వైస్ చైర్మన్​జానయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంధన వినియోగాన్ని తగ్గించిన సంస్థలకు గవర్నర్ పురస్కారాలు అందజేశారు. 8 కేటగిరీల్లో ప్రకటించగా దక్షిణ మధ్య రైల్వే మూడు అవార్డులు సొంతం చేసుకుంది.