వరంగల్సిటీ, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్తీ కోసం రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ బుధవారం రిలీజ్ చేసింది. మొదటి విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కాలేజీల వారీగా ఖాళీ సీట్ల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
