గుళ్లో పాఠాలు చెబుతున్న టీచర్స్.. సిరిసిల్ల జిల్లాలో విద్యార్థులు ఇ బ్బంది పడకుండా చర్యలు

గుళ్లో పాఠాలు చెబుతున్న టీచర్స్.. సిరిసిల్ల జిల్లాలో విద్యార్థులు ఇ బ్బంది పడకుండా చర్యలు

స్కూల్​లో సరిపడా గదులు లేక విద్యార్థులకు గుడిలో పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలోని ఎంపీపీఎస్‌‌లో 29 మంది స్టూడెంట్స్​ చదువుతున్నారు. ఇటీవల ప్రీ ప్రైమరీ తరగతులు కూడా మంజూరయ్యాయి. 

అయితే ఈ స్కూల్​లో గతంలో రెండు గదులు మాత్రమే ఉండగా.. శిథిలావస్థకు చేరడంతో  ఒక గదిని కూల్చేశారు. ప్రస్తుతం ఒక్క గది మాత్రమే మిగిలింది. అది సరిపోకపోవడంతో పక్కనే ఉన్న గుడిలో తరగతులు నిర్వహిస్తున్నారు. కొత్త పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని సర్పంచ్‌‌ కిషన్‌‌ కోరారు.    -