హైదరాబాద్, వెలుగు: జీవో నంబర్ 39 అమలుపై చర్చించేందుకు వ్యవసాయ కమిషనరేట్‌కు వెళ్లిన గ్రాడ్యుయేట్ ఏఈవోలపై దాడికి ప్రయత్నించిన ఘటనను గ్రాడ్యుయేట్ ఏఈవోల అసోసియేషన్ ఖండించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి చాంబర్‌లో చర్చ జరుగుతున్న సమయంలో టీఎన్జీఏవో అధ్యక్షుడు మారని జగదీశ్వర్, టీఏఈవో అధ్యక్షుడు, వారి బృందాలు వాగ్వాదానికి దిగినట్లు సంఘం ఆరోపించింది.
ఈ ఘటనపై అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు అసోసియేషన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
