ఉక్రెయిన్‌, ర‌ష్యాల మ‌ధ్య రేపు రెండో విడ‌త చ‌ర్చ‌లు

ఉక్రెయిన్‌, ర‌ష్యాల మ‌ధ్య రేపు రెండో విడ‌త చ‌ర్చ‌లు

ఓ వైపు యుద్ధం.. మ‌రోవైపు చ‌ర్చ‌లు.. ఇది ర‌ష్యా, ఉక్రెయిన్ల మ‌ధ్య సాగుతున్న ప్రస్తుత పరిస్థితి. ఆరు రోజుల క్రితం ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన  ర‌ష్యా భీకర దాడుల‌తో తెగ‌బడుతోంది. ఆరు రోజులుగా సాగిస్తున్న యుద్ధాన్ని ర‌ష్యా అంత‌కంత‌కూ పెంచుకుంటూ పోతూనే ఉంది. ర‌ష్యా దాడుల‌ను తిప్పికొట్టేందుకు త‌న ఆయుధాలతోనే  ఉక్రెయిన్ కూడా ఎదురు దాడి చేస్తోంది. ఈ క్ర‌మంలో చ‌ర్చ‌లంటూ ర‌ష్యా ప్ర‌తిపాదించ‌గా..ఉక్రెయిన్ కూడా అందుకు అంగీక‌రించింది.

సోమ‌వారం రోజున ర‌ష్యా మిత్ర దేశంగా భావిస్తున్న బెలార‌స్‌లో రెండు దేశాల ప్ర‌తినిధుల మ‌ధ్య మొదటి విడ‌త చ‌ర్చ‌లు జ‌రిగాయి. 3 గంట‌ల‌కు పైగా జ‌రిగిన ఈ చ‌ర్చ‌ల్లో ఇరు దేశాలు త‌మ త‌మ వాద‌న‌ల‌కే క‌ట్టుబ‌డిన నేప‌థ్యంలో ఎలాంటి ఫ‌లితం లేకుండానే చ‌ర్చ‌లు ముగిశాయి. సోమ‌వారం అసంపూర్తిగా ముగిసిన చ‌ర్చ‌ల‌ను పునఃప్రారంభించాల‌ని రష్యా, ఉక్రెయిన్ దేశాలు నిర్ణయించుకున్నట్లు రాయిటర్ వార్తా సంస్థ తెలిపింది. దీనికి సంబంధించి మ‌రోసారి  బెలార‌స్‌లోనే రేపు(బుధ‌వారం) రెండో విడ‌త చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఇరు దేశాలు నిర్ణ‌యించాయి. 

మరిన్ని వార్తల కోసం..

పుతిన్‌ బ్లాక్ బెల్ట్ రద్దు చేసిన తైక్వాండో