ఏయ్.. ఇక్కడ నేనే కింగ్.. నేను పెట్టినవే రూల్స్

ఏయ్.. ఇక్కడ నేనే కింగ్.. నేను పెట్టినవే రూల్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. మరో పదిరోజుల్లో సినిమా విడుదలవుతున్న క్రమంలో ‘హకుం’ అనే రెండో పాటని ఆదివారం విడుదల చేశారు. తెలుగు వెర్షన్‌‌‌‌ సాంగ్‌‌‌‌ను హీరో వెంకటేష్‌‌‌‌ సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేశారు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ రాశారు.

 ‘ఏయ్.. ఇక్కడ నేనే కింగ్.. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్‌‌‌‌ను నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది గప్‌‌‌‌చుప్‌‌‌‌గా ఫాలో అవ్వాలి’ అనే రజినీకాంత్‌‌‌‌ డైలాగ్‌‌‌‌తో పాట మొదలైంది. ‘హుకుం.. టైగర్ కా హుకుం.. ఉరుముకు, మెరుపుకి పుట్టాడురా... పిడుగుని పిడికిట పట్టాడురా.. అడుగడుగున గుడి కట్టాలిరా.. తరతరతరముల సూపర్ స్టార్ రా..’ అంటూ సాగిన ఈ పాటలో రజనీకాంత్ మాస్ లుక్‌‌‌‌లో కనిపించారు.

 ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్వాగ్ ఇంప్రెస్ చేస్తున్నాయి. తమన్నా హీరోయిన్‌‌‌‌గా నటించిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, శివ రాజ్‌‌‌‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, వినాయకన్, మర్నా మీనన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. మోహన్‌‌‌‌లాల్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 10న సినిమా విడుదల కానుంది.