యుగాంతమైనా మారిపోని కథ.. సంగీత ప్రియులను ఇంప్రెస్ చేస్తోన్న కుబేర సెకండ్ సింగిల్

యుగాంతమైనా మారిపోని కథ.. సంగీత ప్రియులను ఇంప్రెస్ చేస్తోన్న కుబేర సెకండ్ సింగిల్

ధనుష్, నాగార్జున లీడ్ రోల్‌‌‌‌లో శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం ‘కుబేర’. రష్మిక హీరోయిన్‌‌‌‌. బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్ర పోషించాడు.  సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు కలిసి నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ సినిమాపై ఆసక్తిని పెంచగా, మంగళవారం సెకండ్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు.

 ‘అనగనగా  కథ.. అందరికీ తెలిసిన కథ.  దీని అంతే తెలియని కథ.. నమ్మేవాడిని అమ్మేయడం, మొక్కేవాడిని తొక్కేయడం.. దొరికే వాడిని దోచేయడం, తల వొంచే వాడిని ముంచేయడం.. యుగాల నుండి జరుగుతున్న కథ.. యుగాంతమైనా మారిపోని కథ’ అంటూ సాగిన పాట ఇంప్రెస్ చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ పాట కంపోజ్ చేయగా, చంద్రబోస్ ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. కరీముల్లా, హైదే కార్తీ కలిసి పాడిన తీరు మెస్మరైజ్ చేస్తోంది. ఇందులో  ధనుష్, నాగార్జున డిఫరెంట్ గెటప్స్‌‌‌‌లో  కనిపించడం ఆకట్టుకుంది. వారి ఎక్స్‌‌‌‌ప్రెషన్స్ ఐడియాలజీని  ప్రజెంట్ చేస్తున్నాయి.