జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలి విడత వారాహి యాత్ర ముగిసిన విషయం తెలిసిందే. దీంతో రెండో విడత యాత్రపై దృష్టి సారించారు. ఈ నెల 9న ఏలూరు నుంచి వారాహి యాత్ర పున:ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ మేరకు రెండో విడత వారాహి యాత్ర షెడ్యూల్‌ను పవన్ కల్యాణ్, పార్టీ నేతలు ఖరారు చేశారు. . వారాహి రెండో విడత యాత్రను ఏ తారీకు వరకు కొనసాగించాలి, ఎన్ని సభల్లో ప్రసంగాలి, ర్యూట్ మ్యాప్ వంటి తదితర అంశాలపై చర్చించనున్నారు.
ఏలూరుతోపాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గ నేతలతో సమావేశం అనంతరం రెండో విడత ముగింపు తేదీ ప్రకటించనున్నారు.
