
- సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేట, వెలుగు : రెండవ విడత గొర్రెల పంపిణీ టార్గెట్ పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. గురువారం స్పెషల్ కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం, బళ్ళారి వెళ్తున్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనల ప్రకారమే గొర్రెలను ఎంపిక చేసుకోవాలని, కొనుగోలు చేసిన గొర్రెలను జాగ్రత్తగా లబ్ధిదారులకు అప్పగించాలని అన్నారు.
తెలంగాణ గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ జారీ చేసిన అంశాల ప్రకారం అధికారులు గొర్రెలను పంపిణీ చేయాలని సూచించారు. లబ్ధిదారులు గొర్రెలు తీసుకున్న వెంటనే అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీ జగత్ కుమార్ రెడ్డి, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, సెరికల్చర్ ఏడీ ఇంద్రసేనారెడ్డి, ఏడీ మైనింగ్స్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.