
చెన్నై: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్‌లో రెండో విజయం సాధించాడు. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో అర్జున్.. రే రాబ్సన్ (అమెరికా)పై గెలిచాడు. దాంతో రెండున్నర పాయింట్లతో రెండో ప్లేస్‌ను పటిష్టం చేసుకున్నాడు. కార్తికేయన్ మురళీపై గెలిచిన విన్సెంట్ కీమర్ (జర్మనీ) మూడు పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
ఇతర గేమ్‌ల్లో విదిత్ సంతోష్ గుజరాతీ (1.5).. నిహాల్ సరిన్ (0.5)పై, అవోండర్ లియాంగ్ (1.5).. జోర్డాన్ వాన్ ఫోరెస్ట్ (1)పై గెలవగా, అనిష్ గిరి (1.5).. వి. ప్రణవ్ (1) మధ్య జరిగిన గేమ్ డ్రా అయ్యాయి. చాలెంజర్స్‌లో ద్రోణవల్లి హారిక (0.5).. అదిబన్ భాస్కరన్ (1.5) మధ్య జరిగిన గేమ్ డ్రా అయ్యింది. ఇతర గేమ్‌ల్లో అభిమన్యు పురానిక్ (2.5).. హర్షవర్ధన్ (0.5)పై, ప్రాణేశ్ (2.5).. ఇనియాన్ (1.5)పై, లియోన్ ల్యూక్ మెండోన్కా (2).. ఆర్. వైశాలి (1)పై గెలిచారు. ఆర్యన్ చోప్రా (1).. దీప్తయాన్ ఘోష్ (2) మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది.