
బోధన్, వెలుగు: బోధన్ పట్టణంలోని ఇందూర్ బీఈడీ కాలేజీలో సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఐదు రోజులు శిక్షణ ఇస్తున్నట్లు ఎంఈవో నాగయ్య తెలిపారు. మంగళవారం రాష్ట్ర విద్యా సంచాలకులు, జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత స్కూళ్ల ఉపాధ్యాయులకు తెలుగు, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చామన్నారు. బోధనాభ్యాసన సామర్థ్యాలు, విద్యార్థుల అభ్యసన ఫలితాలు తదితర అంశాలను వివరించారు. రిసోర్స్ పర్సన్లు వెంకటేశ్వర్లు, హనుమాన్లు, ఫిరాజి, శ్రీకాంత్, సంజీవ్, శ్రీహరి, శ్రీధర్, సీఆర్పీలు విజయ్, యూసుఫ్, విజయ, రేఖ, దేవానంద్, కోఆర్డినేటర్ నగేశ్ పాల్గొన్నారు.
బాల్కొండ, ముప్కాల్ మండలాల్లో..
బాల్కొండ, వెలుగు: బాల్కొండ, ముప్కాల్ మండలాల్లో మంగళవారం టీచర్లకు ఐదురోజుల ట్రైనింగ్ ప్రారంభమైంది. స్టూడెంట్స్ కు సులువుగా అర్థమయ్యేలా బోధనపై సలహాలు, సూచనలు చేసినట్లు బాల్కొండ ఎంఈవో బట్టు రాజేశ్వర్ తెలిపారు. ప్రాథమిక స్థాయి ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్లు, టీచర్లు దాదాపుగా 43 మంది హాజరయ్యారని చెప్పారు. రిసోర్స్ పర్సన్స్ బోయడ నర్సయ్య, పబ్బశంకర్, యు.నటరాజ్, ఎస్.రాజేశ్, రమాదేవి, రాస రవి, సీఆర్పీలు, ప్రభాకర్, సుమలత పాల్గొన్నారు.