
హైదరాబాద్ : సెక్రటేరియట్ కు కొత్త బిల్డింగ్ నిర్మాణంలో ఉండటంతో… ఆయా శాఖలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సెక్రటేరియట్ తరలింపునకు ప్రతిశాఖకు ఇన్‌చార్జ్‌గా నోడల్ అధికారిని నియమించింది. ఏ శాఖను ఎక్కడకు తరలించాలి.. ఎన్నిరోజుల్లో తరలించాలనేదానిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఏ శాఖ ఎక్కడకు వెళ్తోందంటే…
హోంశాఖ- బీఆర్‌కే భవన్
హౌసింగ్- హిమాయత్‌నగర్
ఆర్థిక- బీఆర్‌కే భవన్
సివిల్ సప్లయిస్- ఎర్రమంజిల్
అటవీ-అరణ్యభవన్
బీసీ వెల్ఫేర్-సంక్షేమభవన్
ఉన్నతవిద్య-ఎస్‌సీఆర్టీ
విద్యుత్- విద్యుత్ సౌధ
ఇండస్ట్రీస్- ఎస్‌ఎఫ్‌సీ భవన్
రెవెన్యూ-రిజిస్ట్రేషన్ల శాఖ భవనానికి తరలించనున్నారు.
మరికొన్ని శాఖలకు భవనాలను త్వరలోనే కేటాయించనున్నారు అధికారులు.