మే13న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక

మే13న  సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు నాలుగో విడతతలో మే 13న నిర్వహించనున్నట్లుగా ఈసీ ప్రకటించింది. లోక్ సభ ఎన్నికలతో పాటుగా అదే రోజున సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన లాస్యనందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. 

ఏప్రిల్ 18న ఈ అసెంబ్లీ స్థానానికి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదవుతుంది. మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కంటోన్మెంట్ తో పాటుగా పలు రాష్టాల్లోని  26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించనుంది.  

  • 2024, మార్చి 16వ తేదీ షెడ్యూల్ ప్రకటన
  • ఏప్రిల్ 18వ తేదీ : ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల
  • ఏప్రిల్ 25వ తేదీ : నామినేషన్ దాఖలుకు చివరి రోజు
  • ఏప్రిల్ 26వ తేదీ : నామినేషన్ల పరిశీలన
  • ఏప్రిల్ 29వ తేదీ : నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ
  • మే 13వ తేదీ : తెలంగాణ పార్లమెంట్ పోలింగ్
  • జూన్ 4వ తేదీ : ఓట్ల కౌంటింగ్
  • జూన్ 6వ తేదీ : ఎన్నికల ప్రక్రియ ముగింపు