జువెలరీ షాపు ఓనర్లతో డీసీపీ మీటింగ్

జువెలరీ షాపు ఓనర్లతో  డీసీపీ మీటింగ్

పద్మారావు నగర్, వెలుగు: తెలియని వ్యక్తుల  నుంచి, దొంగిలించిన బంగారాన్ని కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని సికింద్రాబాద్ నార్త్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోన్ డీసీపీ ఎస్. రష్మి పెరుమాల్ జువెలరీ యజమానులను హెచ్చరించారు. బుధవారం జువెలరీ, హై-వాల్యూ ఎలక్ట్రానిక్స్ దుకాణాల ఓనర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. దుకాణాలు నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. సీసీటీవీలు, పానిక్ బటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆఫర్లు లేదా పెద్ద ఈవెంట్లు నిర్వహించే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సరైన ధ్రువీకరణ లేని వస్తువులు కొనొద్దన్నారు.