
- బస్సుల అద్దాలనుధ్వంసం చేసిన నలుగురు అరెస్ట్
- ఆలయ దాడిలో ప్రధాన నిందితుడిని త్వరలో రిమాండ్ చేస్తం
- 140 మంది కోసం ముంబైలో గాలిస్తున్నం: డీసీపీ రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ గుడిలోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని, త్వరలోనే అతన్ని రిమాండుకు తరలిస్తామని నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మిపెరుమాళ్ తెలిపారు. మంగళవారం ఆమె ముత్యాలమ్మ గుడి వద్ద పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ముత్యాలమ్మ ఆలయం వద్ద ప్రశాంత వాతావరణం ఉందని, అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు.
గుడిపై దాడికి ముందు మెట్రో పోలిస్హోటల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు హాజరైన 140 మంది వివరాలు సేకరిస్తున్నామని, వారిని పట్టుకునేందుకు ముంబైకి స్పెషల్టీమ్స్పంపించామని చెప్పారు. ఈ నెల 19న విశ్వహిందూపరిషత్, బజరంగ్దళ్ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌లో హింస చెలరేగిందని, ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేసిన నలుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు. పోలీసులపై రాళ్లు, చెప్పులు, వాటర్‌బాటిళ్లు విరిసి గాయపరిచిన16 మందిని మార్కెట్ పోలీసులు అరెస్ట్‌చేశారని వెల్లడించారు.
సీసీ ఫుటేజీల ద్వారా దాడికి పాల్పడిన వారిని గుర్తిస్తున్నట్లు తెలిపారు. 16 మందిలో మోండా డివిజన్ కార్పొరేటర్కొంతం దీపిక భర్త, బీజేపీ నాయకుడు నరేశ్ పోలీసులు ఏ1గా చేర్చారు. అలాగే ఆనంద్ ట్రేడర్స్ యజమాని ప్రశాంత్, మల్కాజిగిరికి చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు కిరణ్, కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వంశీతిలక్, శరత్ సింగ్ ఠాకూర్, బజరంగ్దళ్ కు చెందిన రామ్ రెడ్డి, కిషన్, శివరాం, సాయిప్రకాష్, సంతోశ్, రాజేశ్, శ్రీనివాస్, శరత్, సుభాష్, అంజి, ప్రవీణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.