సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం 

సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం 

సికింద్రాబాద్ రూబీ హోటల్ ప్రమాదంపై దర్యాప్తును స్పీడప్ చేశారు అధికారులు. ప్రమాదానికి సంబంధించి మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. రాజేందర్ సింగ్ బగ్గా, సుమిత్ సింగ్ బగ్గా, మేనేజర్ సుదర్శన్ తో పాటు సూపర్ వైజర్ ను అరెస్ట్ చేశారు. నిన్ననే రాజేందర్ సింగ్ బగ్గాను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత మేడ్చల్ ఫామ్ హౌజ్ లో సుమిత్ సింగ్ బగ్గాను అదుపులోకి తీసుకున్నారు.  

మరోవైపు ఫైర్ డిపార్ట్ మెంట్ మూడు పేజీల నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. భవన ఓనర్, హోటల్ యజమాని నిర్లక్ష్యంతోనే అగ్నిప్రమాదం జరిగిందని స్పష్టం చేసింది. సెల్లార్ లోనే అగ్నిప్రమాదం జరిగిందని.. తర్వాత మంటలు మొదటి అంతస్తు వరకు వ్యాపించాయని అధికారులు రిపోర్ట్ లో తెలిపారు. లిథియం బ్యాటరీ పేలుళ్లతో దట్టమైన పొగలు వ్యాపించినట్లు తెలిపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని..భవనానికి ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ మాత్రమే ఉందని ఫైర్ డిపార్ట్ మెంట్ తెలిపింది. లిఫ్ట్ పక్కన మెట్లు ఏర్పాటు చేయకూడదన్న నిబంధన పట్టించుకోలేదని స్పష్టం చేసింది.