ఈ నెల 15న సికింద్రాబాద్‌–విశాఖ రైలు ప్రారంభం

ఈ నెల 15న సికింద్రాబాద్‌–విశాఖ రైలు ప్రారంభం

ఈ నెల 15న సికింద్రాబాద్‌–విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం కాబోతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పచ్చజెండా ఊపి దీన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. సికింద్రాబాద్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి హాజరుకానున్నట్టు వెల్లడించారు. ఈ నెల19న ప్రధాని పర్యటన వాయిదా నేపథ్యంలో ఈ కార్యక్రమం ముందుకు జరపడం జరిగిందని వివరణ ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎట్టకేలకు కేంద్రం శుభవార్త చెప్పింది. కేంద్ర రైల్వే శాఖ రెండు తెలుగు రాష్ట్రాలలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదట ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ను సికింద్రాబాద్ నుండి విజయవాడ వరకు నడపాలని భావించారు. అయితే ప్రస్తుతం ఈ ఎక్స్‌ప్రెస్‌ ను సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు పొడిగించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వందే భారత్ రైలు ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ నెల 19న రాష్ట్రానికి వస్తారని ముందుగా ప్రకటించినప్పటికీ.. అది వాయిదా కావడంతో ఈ నెల 15న వర్చువల్ గా ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.