V6 News

విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ రైలు రద్దు

విశాఖ- సికింద్రాబాద్  వందేభారత్  రైలు రద్దు

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రద్దయ్యింది .  టెక్నికల్ రీజన్స్ తో   ఈ రైలును ఇవాళ రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు  ప్రకటన  రిలీజ్ చేశారు .ఆగస్టు17  ఉదయం 5.45 కి ఈ రైలు బయల్దేరాల్సి ఉంది . ఈ రైలుకు ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశారు . ఇది ఉదయం 7 గంటలకు బయలుదేరింది . ఈ రైలు కేవలం వందేభారత్ స్టాపుల్లోనే ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే ఆయా రైల్వే స్టేషన్లలో అధికారుల్ని సంప్రదించాలని సూచించారు.

విశాఖ నుంచి సికింద్రాబాద్ కు వారంలో ఆరు రోజులు వందేభారత్ ట్రైన్ రాకపోకలు సాగిస్తుంది.వందేభారత్ ట్రైన్  ప్రతీ రోజు ఉదయం విశాఖలో బయల్దేరి మధ్నాహ్నం సికింద్రాబాద్ చేరుకుంటది. తిరిగి సికింద్రాబాద్ లో బయల్దేరి రాత్రికి విశాఖ చేరుకుంటది.