మోడీ కాన్వాయ్ మీదికి దూసుకొచ్చిన యువకుడు

మోడీ కాన్వాయ్ మీదికి దూసుకొచ్చిన యువకుడు

ప్రధాని మోడీ కర్నాటక పర్యటనలో భద్రతాలోపం బయటపడింది. హుబ్బళ్లిలో రోడ్ షో నిర్వహిస్తుండగా ఓ యువకుడు కాన్వాయ్ లోకి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బందిని దాటుకొని పూల దండ్ల పట్టుకుని సదరు యువకుడు మోడీ కారు దగ్గరకు పరుగెత్తుకువచ్చాయి. మోడీ మెడలో దండ వేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని పక్కకు లాగేశారు. ప్రధాని మోడీ కాన్వాయ్ లోకి యువకుడు దూసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై సీఎంఓ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.