గరియాబంద్‌‌ జిల్లాలోమావోయిస్టుల డంప్‌‌ స్వాధీనం

గరియాబంద్‌‌ జిల్లాలోమావోయిస్టుల డంప్‌‌ స్వాధీనం

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రం గరియాబంద్‌‌ జిల్లాలో మావోయిస్టులకు చెందిన రెండు భారీ డంప్‌‌లను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గరియాబంద్‌‌ జిల్లా అడిషనల్‌‌ ఎస్పీ ధీరేంద్రపటేల్‌‌ పర్యవేక్షణలో డీఆర్‌‌జీ బలగాలు శనివారం కూంబింగ్‌‌ మొదలుపెట్టాయి.

మైన్‌‌పూర్‌‌ పీఎస్‌‌ పరిధిలోని కడేదోర గ్రామ శివార్లలోని భాలూడిగ్గీ గుట్టల్లో రెండు చోట్ల ఉన్న డంపులను గుర్తించారు. ఒక డంపులో రూ.46.31 లక్షలు, మరో డంప్‌‌లో బర్మార్‌‌ తుపాకులు, రైఫిల్స్, ఎల్‌‌ఎంజీలు, ల్యాప్‌‌ట్యాప్‌‌లు, మొబైల్స్‌‌, ఎస్‌‌ఎల్‌‌ఆర్‌‌, ఇన్సాస్​, ఏకే-47, 303, స్టెన్‌‌ గన్‌‌, 12 బోర్‌‌ తుపాకుల బుల్లెట్లు, 13 ఎలక్ట్రిక్‌‌ డిటోనేటర్లు, 10 నాన్‌‌ ఎలక్ట్రిక్​డిటోనేటర్లు, గ్రేనేడ్స్‌‌ దొరికాయని భద్రతాబలగాలు వెల్లడించాయి.