జమ్మూకశ్మీర్ కాల్పులు.. ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్

జమ్మూకశ్మీర్ కాల్పులు.. ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్

జమ్మూకశ్మీర్ లో ఇవాళ(బుధవారం) భారీ ఉగ్ర కుట్రను భద్రతాబలగాలు భగ్నం చేశాయి. షోపియాన్ జిల్లాలోని ఓ ఇంటిలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు భద్రతా బలగాలను నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసుల కాన్వాయ్ లక్ష్యంగా వీరు దాడులకు పాల్పడే అవకాశముందని సమాచారం అందించాయి. వెంటనే అలర్టైన బలగాలు ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిపై మెరుపుదాడులు జరిపాయి.

హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు సజీవంగా పట్టుకున్నాయి. భూమిలో అమర్చడానికి సిద్ధం చేసిన శక్తిమంతమైన IEDని స్వాధీనం చేసుకున్నారు. భద్రతాబలగాలు రాకపోకలు సాగించే రోడ్డుపై ఈ IEDని అమర్చేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నాయని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. పక్కా సమాచారంతో ఈ కుట్రను భగ్నం చేశామన్నారు.