కాజీపేట్, వరంగల్ రైల్వేస్టేషన్లకు భద్రత పెంపు..

 కాజీపేట్, వరంగల్ రైల్వేస్టేషన్లకు భద్రత పెంపు..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇవాళ తీవ్ర విధ్వంసం చేటు చేసుకున్నది. అగ్నిపథ్ నిరసనలు తెలంగాణను సైతం తాకాయి. ఇవాళ బస్సులపై ఆర్మీ అభ్యర్థులు రాళ్లు రువ్వారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రెండు రైలు బోగీలకు నిప్పంటించారు. దీంతో సికింద్రాబద్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ దేశ వ్యాప్తంగా పలు రైల్యే జోన్లకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు కాజీపేట రైల్వే జంక్షన్, వరంగల్ రైల్వేస్టేషన్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ల వద్ద అదనపుల బలగాల మోహరించాయి. రైల్వే పోలీసులతో పాటు సివిల్ పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. భద్రత పెంచి, నిఘా కట్టుదిట్టం చేయాలని శాఖాధిపతులు, సెక్రెటరీలకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఆర్మీలో ప్రవేశపెట్టనున్న అగ్నిపద్ కు వ్యతిరేకంగా ఆందోళనల నేపథ్యంలో కాజీపేట రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను స్టేషన్ లోకి రాకుండా స్థానిక పోలీసులు అడ్డుకుంటున్నారు.