హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల లెర్నింగ్ విధానాల్లో మార్పులు తీసుకువచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నస్టిక్స్ (ఎస్ఈడీ) తన ప్లాట్‌ఫామ్‌ను భారత్‌లో అధికారికంగా ప్రారంభించింది. ఈ సంస్థతో శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ చేతులు కలిపింది. హైదరాబాద్‌లోని హోటల్ దస్పల్లాలో శుక్రవారం ఎంవోయూ కుదుర్చుకున్నారు.
విద్యార్థులు పాఠాలను ఎలా గ్రహిస్తున్నారు? ఎక్కడ వెనుకబడుతున్నారనే అంశాలను ఎస్ఈడీ సంస్థ విశ్లేషించి, వ్యక్తిగత అభివృద్ధి మార్గాలను రూపొందించనుంది. ఎస్ఈడీ వ్యవస్థాపకుడు వి.శ్రీనేశ్, ఎస్ఈడీ సీఈవో అష్లీ సంబాలుక్ , శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అకాడమిక్ డైరెక్టర్ సీమ బొప్పన పాల్గొన్నారు.
