మిసైళ్ల దాడికి ఇండ్లు ఎలా డ్యామేజ్ అవుతున్నాయో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో !

మిసైళ్ల దాడికి ఇండ్లు ఎలా డ్యామేజ్ అవుతున్నాయో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో !

ఇరాన్ - అమెరికా యుద్ధం. మూడు వారాలు దగ్గరపడుతున్నా ఇంకా ఆగడం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా సమరం జరుగుతోంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే.. గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్ పైనా ఇరాన్ మిసైళ్లు, డ్రోన్స్ తో విరుచుకుపడుతోంది. శనివారం (మార్చి 21) ఇరాన్ అణు కేంద్రం నటాంజ్ పై ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ లోని రెండు అణుస్థావరాలను టార్గెట్ చేస్తూ మిసైళ్లను వదిలింది ఇరాన్.

ఇజ్రాయెల్ లోని డిమోనా సమీపంలోని న్యూక్లియర్ సైట్ పై మిసైళ్లతో దాడి చేసింది ఇరాన్. ఇజ్రాయెల్ లో అతి ముఖ్యమైన అణు పరిశోధన కేంద్రంపై జరిపిన దాడిలో సైట్ తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది. న్యూక్లియర్ సైట్ పై దాడి చేసే క్రమంలో.. దానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిమోనా పట్టణంలో కొన్ని మిసైళ్లు పడ్డాయి. అగ్నిగోళాలు వచ్చి పడుతున్న వీడియో, ఇల్లు డ్యామేజ్ అయిన వీడియోలు వైరల్ గా మారాయి. మిసైల్ ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో తెలిపే వీడియో అని వైరల్ చేస్తున్నారు. 

మిసైళ్ల దాడితో డిమోనా ప్రజలు ఇళ్లలోనే దాక్కున్నారు. ఎక్కడ బాంబులు పేలుతాయోనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న సమయంలో.. ఆకాశం నుంచి అగ్నిగోళాలు పడ్డట్టుగా మిసైల్ బాంబులు డిమోనా పట్టణంలో పడ్డాయి. ఎక్కడో దూరంగా మిసైల్స్ పడినా.. అపార్ట్ మెంట్లు, ఇళ్లు తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి. తలుపులు ఊడిపోయి, కిటికీలు పగిలిపోయి.. ఒక్కసారిగా విధ్వసం జరిగిపోయింది. భయంతో జనాలు పరుగులు పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ఇంకా ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించలేదు. 

ఇజ్రాయెల్ కీలక అణు స్థావరం అయిన డిమోనా పట్టణంతో పాటు అరాద్ టౌన్ పై కూడా మిసైళ్ల దాడులు జరిగాయి. శనివారం (మార్చి 21) నటాంజ్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసిన వెంటనే.. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా అణుస్థావరాలపై విరుచుకుపడింది ఇరాన్. 

డిమోనా, అరాద్ లపై వందల కిలోల బరుబుతున్న రెండు వార్ హెడ్స్, మిసైళ్లతో దాడులు చేసింది ఇరాన్. ఈ దాడులపై ఇజ్రాయెల్ మెడికల్ ఎమర్జెన్సీ సంస్థ మజెన్ దేవిడ్ ఆడమ్ స్పందించింది. అరాద్ లో 84 మంది గాయపడగా 10 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. అదే విధంగా డిమోనాలో 33 మందికి గాయాలైనట్లు ఈ అంబులెన్స్, బ్లడ్ బ్యాంక్ సంస్థ పేర్కొంది.