సీడ్ వ్యాపారులకు అలర్ట్ : సతీ పోర్టల్ ద్వారానే విత్తన లైసెన్స్ : కేంద్ర వ్యవసాయ శాఖ

సీడ్ వ్యాపారులకు అలర్ట్ : సతీ పోర్టల్ ద్వారానే విత్తన లైసెన్స్ : కేంద్ర వ్యవసాయ శాఖ

అన్నీ  విషయాల్లో రైతులు దగాకు గురవుతున్నారు.  విత్తనాల కొనుగోలు దగ్గరి నుంచి పంట అమ్మే వరకు  రైతులు మోసపోతున్నారు.  పంట విత్తనాలను అమ్మేందుకు దుకాణదారులకు కచ్చితంగా లైసెన్స్ అవసరమని కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి తోమర్ తెలిపారు.  రైతులు విత్తనాలు కొనుగోలులో ఇబ్బంది పడకుండా సతీ పోర్టల్ ను లాంఛ్ చేశామని ఆయన తెలిపారు.  ఇప్పటి వరకు వ్యవసాయశాఖ కు దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి విత్తనాలు అమ్మేందుకు లైసెన్స్ జారీ చేసేవారు. అయితే ఇప్పుడు లైసెన్స్ మంజూరు చేసేందుకు ఆన్ లైన్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చింది.  ప్రభుత్వం కొత్తగా సతీ పోర్టల్ ను రూపొందించింది.  రైతులకు పంట విత్తనాలు అమ్మేందుకు ఇకపై సతీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  లైసెన్స్ పొందిన వారు ఎప్పటికప్పుడు వివరాలు సతీ పోర్టల్ లో నమోదు చేయాలి.

విత్తనాల అమ్మకంలో జరిగే అవకతవకలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సతీ పోర్టల్ ను ప్రారంభించింది.  దీంతో పాటు మొబైల్ యాప్ ను కూడా ప్రభుత్వం ఆవిష్కరించింది.  విత్తనాల పేరుతో మోసపోతున్న రైతులను కాపాడేందుకే ఈ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చినట్టు వ్యవసాయ శాఖ తెలిపింది. వ్యవసాయరంగంలోని సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వ్యవసాయశాఖ తెలిపింది.  రైతులకు నాణ్యమైన విత్తనాలను అందిచేందుకు SATHI పోర్టల్  ఎంతో ఉపయోగపడుతుందని  వ్యవసాయశాఖాధికారులు తెలిపారు.  విత్తనాల కొనుగోలును కూడా ఈ పోర్టల్ ద్వారానే లావాదేవీలు జరగాలని ప్రభుత్వం తెలిపింది.  

కేంద్ర వ్యవసాయ శాఖ సతీ పోర్టల్ లో ధృవీకరించిన తరువాతే విత్తనాలను అమ్మకాలు జరపాలి.  ఈ లైసెన్స్ ను మంజూరు చేసేందుకు  ఏడు శాఖల  అధికారులు పరిశీలిస్తారు.  అయితే రాష్ట్రప్రభుత్వాలు లైసెన్స్ మంజూరు చేసిన డీలర్లు మాత్రమే  సతీ పోర్టల్ లో దరఖాస్తు చేసేందుకు అర్హత కలిగి ఉంటారని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. 

సతీ పోర్టల్ ద్వారా లైసెన్స్ ఎలా పొందాలి....

  • పోర్టల్ లో నమోదు చేసుకునే ముందు విత్తనాలను ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారో తెలపాలి
  • విత్తనాలను ఏ ప్రాంతంలో అమ్ముతారో.. వాటిని ఎక్కడ నిల్వ చేస్తారో వివరాలు సతీ పోర్టల్ లో నమోదు చేయాలి.
  • పోర్టల్ పేర్కొన్న వివరాలు.. పేరు.. తండ్రిపేరు.. చిరునామా..ఈ మెయిల్ ఐడీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఇతర వివరాలు నమోదు చేయాలి.
  • లైసెన్స్ ఫీజు ఆన్ లైన్ పద్దతిలో చెల్లించాలి.
  • లైసెన్స్ ఫీజు చెల్లించిన 45 రోజుల లోపు లైసెన్స్ కూడా సతీ పోర్టల్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలి. 

కావలసిన డాక్యుమెంట్లు

  • డీలర్ గా దరఖాస్తు చేసే వ్యక్తి పాస్ పోర్ట్ ఫొటో
  • గుర్తింపు కార్డ్ ( ఐడెంటిటీ ప్రూఫ్)
  • ల్యాండ్ రికార్డ్ అగ్రిమెంట్ ( అద్దె ప్రాతిపదికన అయితే ఓనర్ నుంచి రెంటల్ అగ్రిమెంట్).. స్వతం అయితే సంబంధిత దస్తావేజులు
  • స్కెచ్ మ్యాప్
  • సోర్స్ ధృవీకరణ పత్రం
  • నాణ్యత పనితీరు ధృవీకరణ పత్రం
  • స్టేట్ డీలర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్