ఓయూలో సీతారాం ఏచూరి సంస్మరణ సభ

ఓయూలో సీతారాం ఏచూరి సంస్మరణ సభ

ఓయూ, వెలుగు: ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం రాత్రి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏచూరి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్​నాగేశ్వర్​మాట్లాడుతూ ఏచూరి వ్యక్తిత్వం చాలా ఉన్నతమైనదని, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. 

గొప్ప స్నేహశీలి అని, నిరంతరం అధ్యయనం చేసేవాడని కొనియాడారు.  కార్యక్రమంలో ఎస్ ఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వీరయ్య, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆర్ఎల్ ​మూర్తి,  ప్రొఫెసర్​కొండా నాగేశ్వర్​, ప్రొఫెసర్​ఆమంచి నాగేశ్వర్, ఎస్ఎఫ్ఐ లీడర్లు రవి నాయక్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.