వేసవిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి...మంత్రి సీతక్క

వేసవిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి...మంత్రి సీతక్క
  • అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రండి

ములుగు (గోవిందరావుపేట), వెలుగు : ఎండ తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. బయట ఏమైనా పనులుంటే ఉదయం 11 గంటల్లోపు, సాయంత్రం 4 తర్వాత చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా గోవిందరావుపేటలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వృద్ధులు, చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పారు. ఆ టైంలో ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కూలీ పనులు చేసే వారు ఉదయం  11 గంటల్లోపే పనులు ముగించుకుని ఇంటికి చేరుకోవాలన్నారు. వడదెబ్బ తగలకుండా తాగునీరు వెంట ఉంచుకోవాలని సూచించారు.