శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారం పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారం పట్టివేత

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు. 600 గ్రాముల‌ బంగారాన్ని సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి బంగారంతో బయటకు వచ్చిన కేటుగాళ్లు... ఆరైవల్స్ ప్రాంతంలో బంగారాన్ని రిసీవర్స్ ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితుల అరెస్ట్ కాగా.. అనంతరం వారిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. దీంతో కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు.. దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ బంగారాన్ని పట్టుకున్నందుకు గానూ సీఐఎస్ఎఫ్ ఇంటలిజెన్స్ సిబ్బందిని సీఐఎస్ఎఫ్ డీజీ (CISF DG) అభినందించారు.