అబ్బురపరిచిన హైడ్ ఆర్ట్

అబ్బురపరిచిన హైడ్ ఆర్ట్

నానక్​రామ్​గూడలోని నవనామి ఈయాన్​లో మహా సాంస్కృతిక వేడుక ‘హైడ్ ఆర్ట్ 2025’ను సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల శుక్రవారం ప్రారంభించారు. హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరంగా మారుతున్న ఈ సమయంలో ఇటువంటి వేడుకలు అవసరమన్నారు. దేశవ్యాప్తంగా 200 మందికి పైగా కళాకారులు ఈ వేదికలో తమ కళాఖండాలను ప్రదర్శించారు. రేపటి వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉండనుంది. – వెలుగు, శంషాబాద్