V6 News

నేడు (డిసెంబర్ 10న) గ్లోబల్ సమిట్కు స్కూల్ స్టూడెంట్లు

నేడు (డిసెంబర్ 10న) గ్లోబల్ సమిట్కు స్కూల్ స్టూడెంట్లు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించడానికి కొన్ని రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులకు బుధవారం అనుమతిస్తున్నట్టు సర్కారు ప్రకటించింది.  

ఆయా స్కూళ్లను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఎంపిక చేశారని తెలిపింది.  కేవలం ఎంపిక చేసిన స్కూల్ స్టూడెంట్లను మాత్రమే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నది. గురువారం నుంచి మిగిలిన రోజుల్లో ఎవరెవరికి ప్రవేశం ఉంటుందనే విషయమై బుధవారం ప్రకటించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.