సెల్ఫ్​ డిఫెన్స్​ ఎంతో అవసరం..నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్

సెల్ఫ్​ డిఫెన్స్​ ఎంతో అవసరం..నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్

పద్మారావునగర్, వెలుగు: ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ రక్షణ ఎంతో అవసరమని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు స్వీయ రక్షణ, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ఆదివారం తిరుమలగిరిలోని ఎంఎస్‌‌‌‌బీ విద్యా సంస్థలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సైబర్ భద్రత, డగ్స్ నిర్మూలన, అత్యవసర ప్రతిస్పందన సంసిద్ధత వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో ఎంఎస్ బీ స్కూల్ టీచర్లు, నార్త్ జోన్ పోలీసులు పాల్గొన్నారు.