4,066 బడుల్లోని బాలికలకు .. సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్

4,066 బడుల్లోని బాలికలకు .. సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 4,066 సర్కారు బడుల్లో చదివే విద్యార్థినులకు స్పెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ చేపట్టాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ నిర్ణయించింది. ఎంపిక చేసిన స్కూళ్లలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ మూడు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని డైరెక్టరేట్ శ్రీదేవసేన డీఈవోలను ఆదేశించారు. 

వారానికి మూడు సెషన్లుగా.. నెలకు 12 సెషన్స్ కవర్ అయ్యేలా  ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రైమరీ స్కూళ్లు,  3,566 హైస్కూళ్లను శిక్షణా కార్యక్రమానికి ఎంపిక చేసినట్టు వెల్లడించారు. ట్రైనింగ్ అంతా స్కూల్ టైమింగ్స్ లో జరగాలని, పీడీ/పీఈటీ లేదా టీచర్ పర్యవేక్షణలో  చేపట్టాలని సూచించారు. జనవరి 24న అన్ని బడుల్లో, జిల్లా స్థాయిల్లో ప్రదర్శనలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ ప్రోగ్రామ్ నిర్వహణ కోసం రూ.6.09 కోట్ల బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారు.