లోకల్ పోలీసులు పట్టించుకుంటలేరు..శేజల్ ఆరోపణ

లోకల్ పోలీసులు పట్టించుకుంటలేరు..శేజల్ ఆరోపణ

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ మరోసారి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గం చిన్నయ్యపై  కేంద్రమహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశానని.. లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారని తెలిపారు. 

మహిళాకమిషన్ ఆదేశాలతో లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పీఎస్ చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి వరకు ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మండిపడ్డారు. తనకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని శేజల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.