
హైదరాబాద్, వెలుగు: సెల్విన్ ట్రేడర్స్ లిమిటెడ్, అమెరికాకు చెందిన శివం కాంట్రాక్టింగ్వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, సెల్విన్.. శివం కాంట్రాక్టింగ్‌లో 60 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడానికి రూ.52 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడులకు బదులుగా షేర్లను జారీ చేయనుంది. ఈ ఒప్పందం 12 నెలలపాటు చెల్లుతుంది.
శివం కాంట్రాక్టింగ్ అమెరికాలో నిర్మాణ ప్రాజెక్టులను నిర్వహిస్తుంది. సెల్విన్ ట్రేడర్స్ ఆగస్టు 21న దుబాయ్‌కు చెందిన గ్లోబల్ మార్కెట్ ఇన్సైట్స్ ఐటీ సర్వీసెస్ ఎల్ఎల్సీ (జీఎంఐఐటీ)తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. జీఎంఐఐటీలో 51 శాతం వాటాను మిలియన్ డాలర్లతో కొనుగోలు చేసి దానిని తన అనుబంధ సంస్థగా మార్చుకోనుంది. ఈ రెండు భాగస్వామ్యాల ద్వారా గల్ఫ్, అమెరికా మార్కెట్లలో తమ వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.