కేఏపాల్ పార్టీలో చేరిన బాబు మోహన్.. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ

కేఏపాల్ పార్టీలో చేరిన బాబు మోహన్.. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనే బిగ్ డెవలప్మెంట్.. కేఏ పాల్ అంటూ ఎగతాళి చేసే వారికి ఇది షాకింగ్.. ప్రజాశాంతి పార్టీలో మాజీ మంత్రి, సీనియర్ నటుడు బాబూమోహన్ జాయిన్ అయ్యారు. హైదరాబాద్ లోని ప్రజాశాంతి పార్టీ ఆఫీసులో.. కేఏ పాల్ సమక్షమంలో.. జెండా కప్పుకున్నారు. అంతేనా.. రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ బాబూమోహన్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు కేఏ పాల్ పార్టీలో ఆయన ఒక్కటే అన్నీ చేస్తున్నారు.. ఫస్ట్ టైం ఓ సీనియర్ పొలిటీషియన్.. ఆ పార్టీలో జాయిన్ కావటం విశేషం.. పాల్ పొలిటికల్ స్ట్రాటజీ చూస్తుంటే.. రాబోయే రోజుల్లో కామెడీ పాలిటిక్స్ కాదమ్మా.. సీరియస్ పాలిటిక్స్ చేస్తాననే సంకేతాలు ఇచ్చినట్లే కదా.. బాబూమోహన్ అల్లాటప్పా పొలిటీషియన్ కాదు కదా.. మాజీ మంత్రిగా కూడా చేశారు.. మూడు పార్టీల్లో సీనియర్ నేత.. అలాంటి బాబుమోహన్.. కేఏపాల్ పార్టీలో జాయిన్ కావటం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో పాల్ మరిన్ని షాకులు ఇస్తారేమో చూడాలి..

సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. కేఏ పాల్ సమక్షంలో సోమవారం ( మార్చి 4) ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకున్నారు బాబూ మోహన్. ఇటీవల బాబు మోహన్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. బీజేపీ కోసం ఎంతో చేశా.. కానీ తనకు సరైన గుర్తింపు  ఇవ్వలేదన్నారు. తాను ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు బాబు మోహన్ ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుని తప్పక విజయం సాధిస్తానని చెప్పారు బాబు మోహన్. ఈ విషయాన్ని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా స్పష్టం చేశారు.