
శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన వరుస బాంబు పేలుళ్ల నుంచి సినీ నటి రాధికా శరత్‌కుమార్ తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ట్వీట్ లో తెలిపారు. ఈస్టర్ వేడుకల కోసం కొలంబో వెళ్లిన రాధిక సిన్నామన్ గ్రాండ్ హోటల్ లో బస చేశారు. పేలుళ్లు జరగడానికి కొద్ది నిమిషాల ముందు ఆమె హోటల్ ఖాళీ చేసి వెళ్లినట్టు తెలిపారు. ఈ ఘటనతో షాక్ అయ్యాననీ, ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నానని రాధిక వివరించారు. దేవుడి దయ వల్ల ఈ పేలుళ్ల నుంచి తప్పించుకున్నట్టు ఆమె తెలిపారు.