మెదక్ టౌన్, వెలుగు: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, హవేలీ ఘనపూర్ మండలం మద్దుల్వాయి మాజీ సర్పంచ్ గుండారం రామచంద్రా గౌడ్ సోమవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
రామచంద్రా గౌడ్ మృతి పట్ల ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ నివాళులర్పించారు.
